![]() |
![]() |
.webp)
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది అదేంటంటే చంద్రమోహన్ ఏ హీరోయిన్ పక్కన నటిస్తే ఆమె సూపర్ డూపర్ హిట్ ఐపోయి ఫుల్ ఫేమస్ ఐపోతారు. ఐతే ఇప్పుడు ఇలాంటి ఒక కాన్సెప్ట్ టేస్టీ తేజ విషయంలో జరిగింది. అందుకే తెగ ఫీలైపోతున్నాడు. పాపం పెళ్లి చేసుకుందామని అమ్మాయిలను చూస్తున్నా కానీ ఎవరూ తనని చూడడం లేదట. బిగ్ బాస్ సీజన్ 7 లో శోభా శెట్టిని చూసాడు ఆమె ఎంగేజ్ ఐపోయింది. ఈ సీజన్ లో ప్రేరణని చూశాడట ఆల్రెడీ పెళ్లయిపోయింది అంటూ పాపం తన కోసం ఎవరైనా అమ్మాయి ఉందా లేదా అన్న రేంజ్ లో బాధపడుతున్నాడు. అందుకే పాపం బిగ్ బాస్ ని రెండు చేతులు జోడించి ఒక కోరిక కోరుకున్నాడు.
నెక్స్ట్ సీజన్ కి ఒక వేళా తనను పిలిచేట్టు ఐతే గనక పెళ్లి కానీ అమ్మాయిలను పంపించు బిగ్ బాస్ ఎవరో ఒకరిని సెట్ చేసుకుని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. లైఫ్ సెటిల్ చేసాడు బిగ్ బాస్..బిగ్ బాస్ వల్ల బాగా ఫేమస్ అయ్యా మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. ఎం బిగ్ బాస్ ఆమాత్రం పెళ్లి చేయలేడా ఏమిటి చేస్తాడు. బిగ్ బాస్ అడిగినప్పుడు హౌస్ లో క్రష్ ఎవరు అన్నప్పుడు ప్రేరణ అని చెప్పా ఎందుకంటే ఆమె పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ మెటీరియల్. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తానని అస్సలు అనుకోలేదు. కానీ ఛాన్స్ వచ్చింది. ఐతే దీని కోసం రెండు సినిమాలను కూడా వదిలేసాను. 22 రోజుల క్యారెక్టర్ ని వదులుకుని బిగ్ బాస్ కి వచ్చాను. సినిమా ఆఫర్స్ మళ్ళీ వస్తాయి..కానీ ఈ బిగ్ బాస్ నుంచి మళ్ళీ మళ్ళీ పిలుపు వస్తుందో రాదో తెలీదు. అమ్మను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకెళ్లాలన్న కాన్సెప్ట్ తో వెళ్లాను. అలా అక్కడ సక్సెస్ కొట్టాను అని చెప్పాడు టేస్టీ తేజ.
![]() |
![]() |